రైతుముచ్చట, సంగారెడ్డి: దేశంలో సేంద్రీయ వ్యవసాయంలో జీవామృతానికి సాటిగా డిమాండ్ నెలకొంటున్న “గోకృపామృతంపై” రత్నపురి వ్యవసాయ విద్యాసంస్థల ఆధ్వర్యంలోసంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం, తుర్కల ఖానాపూర్ గ్రామంలో మే 22వ తేదీ ఆదివారం రోజు ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమంనిర్వహిస్తునట్లు డైరెక్టర్ డా.VRR డాట్ల తెలిపారు.ఈ కార్యాక్రమానికి గో కృపామృత సృష్టి కర్త, గుజరాత్ రాష్ట్రానికి చెందిన గోపాల్ భాయ్ సుతారియాజీ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత వ్యవసాయం మరియు గో కృపా అమృతం తయారీ చేసే విధానంపైనా శిక్షణ ఇవ్వటమే కాకుండా, గో కృపామృత మధర్ కల్చర్ ను కూడా రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆసక్తి గల రైతులు రిజిష్ట్రేషన్ కొరకు ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. 8522858855. 8686810045. 9505046750. 9449596039.
జీవామృతానికి సాటిగా “గో కృపామృతం” – ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమం