సబ్సిడీపై రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణి

రైతుముచ్చట, సత్తుపల్లి: పట్టణంలోని సిద్దారం రోడ్ లో గల MR గార్డెన్ నందు సత్తుపల్లి PACS ఆధ్వర్యంలో రైతులకు  సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాత మధు, జిల్లా రైతుబంధు అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు మరియు సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు.

30 కేజీలు జీలుగు  పూర్తి ధర 1897.50/- ఉండగా ప్రభుత్వ రాయితీ 65% అనగా 1233.30/- రాయితీతో 664.20/- లకు, అలాగే 20 కేజీలు పిల్లిపెసర పూర్తి ధర 1770/- ఉండగా ప్రభుత్వ రాయితీ 65% అనగా 1082.20/- రాయితీతో రూ . 619.60/- లకు రైతులకు అందిచండం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకోవలసిందిగా సత్తుపల్లి PACS సభ్యులు తెలిపారు.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA