ఇండియా నుంచి గోదుమల ఎగుమతులు బ్యాన్

రైతుముచ్చట, న్యూఢిల్లీ: దేశంలో నిత్యవసర ధరలను అదుపులో ఉంచే చర్యల్లో భాగంగా గోదుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇది తక్షణం అమలులోకి వస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం మార్చి నెలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గోదుమ పంట దిగుబడి ఘననీయంగా తగ్గడం ఒక కారణం అని, ఒకవేళ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏవైనా దేశాలు గోదుమలు ఎగుమతి చేయాలని విజ్ఞప్తి చేస్తే ఆయా దేశాలకు నిషేధం వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA