అగ్రో రైతు సేవా కేంద్రాల(ARSK) నిర్వాహకులకు 10 లక్షల నాబార్డు రుణం

తెలంగాణ, రైతుముచ్చట: మేనేజ్ సంస్థ సహకారంతో తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (AGROS) అగ్రో రైతు సేవా కేంద్రాల నిర్వాహకులకు నిర్వహించిన 45 రోజుల శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. ఈ సంధర్భంగా శిక్షణ పొందిన 30 మంది అభ్యర్థులకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రుణాన్ని నాబార్డు, మేనేజ్ సంస్థలు, SBI సహకారంతో 36 శాతం సబ్సిడీపై అందజేయడం జరిగింది. అదేవిధంగా శిక్షణ పొందిన వారికి హైదారాబాద్ లోని మినిష్టర్ క్వారాటర్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శిక్షణా దృవపత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యాక్రమంలో అగ్రోస్ ఎండీ రాములు మరియు సంబందిత అధికారులు పాల్గొన్నారు.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA