సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్ (CSCB) లో మార్పులు, తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కు చోటు

న్యూఢిల్లీ, రైతుముచ్చట: భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సెంట్రల్ సీడ్ సర్టిఫికేషన్ బోర్డ్(CSCB)లో కీలక మార్పులు చేసింది, ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విత్తన రంగంలో గుర్తింపు పొందిన తెలంగాణ విత్తన సంస్థల డైరెక్టర్ డా.కేశవులుకు CSCB లో అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సెక్రటరీ ఈ బోర్డు ఛైర్మన్ గా మరియు వ్యవసాయ శాఖ కమీషనర్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీల పరిశోధన డైరెక్టర్లు, విత్తన దృవీకరణ సంస్థల డైరెక్టర్లు ఇందులో మెంబర్లు గా ఉంటారు.

ఈ బోర్డు దేశవ్యాప్తంగా విత్తన చట్టం 1966 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరచుకున్న చట్టపరమైన స్వయంప్రత్తిపత్తి సంస్థలైన “సీడ్ సర్టిఫికేషన్ అథారిటీల” పనితీరు, విత్తన దృవీకరణ విధానం, రైతులకు నాణ్యమైన దృవీకరణ విత్తనాల సరఫరా తదితర అంశాలపై చర్చించి పాలసీలు తయారుచేసే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA