తొలిరోజు 1309 మంది రైతు ఖాతాల్లోకి రుణమాఫీ నిధుల బదిలీ

తెలంగాణ, రైతుముచ్చట: 25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న 1309 మంది రైతు ఖాతాల్లోకి తొలిరోజు రుణమాఫీ నిధుల బదిలీకి సంబందించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ నెల 30 వరకు మొత్తం రూ.3 కోట్ల 27 లక్షల 91 వేల 186 రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమకానున్నాయి. ఇందులో భాగంగా 50 వేల రూపాయల లోపు గల రైతుల రుణాలన్నీ కూడా మాఫీ అవనున్నాయి. రైతుబంధు నిధుల పంపిణీ మాదిరిగానే రుణమాఫీ నిధులు కూడా జమ అవుతాయని, రైతుల ఖాతాలలో జమయిన నిధులను ఎట్టి పరిస్థితులలో బ్యాంకర్లు ఇతర పద్దుల కింద జమ చేసుకోవద్దని, రుణాలు మాఫీ అయిన రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు అందజేయాలని, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బ్యాంకర్లకు సూచించారు.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA