రైతుభీమా ప్రీమియం చెక్కును ఎల్ఐసీ ప్రతినిధులకు అందజేత

తెలంగాణ, రైతుముచ్చట: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని మంత్రుల బృందం మంగళవారం రోజు హైదరాబాద్ లో LIC ప్రతినిధులకు 2021-2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్ల రైతుభీమా ప్రీమియం చెక్కును అందజేశారు. ప్రపంచంలో రైతుకు ప్రీమియం చెల్లించి భీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అన్నం పెట్టే రైతన్న ఆత్మవిశ్వాసంతో సాగు చేసేందుకే వ్యవసాయ అనుకూల విధానాలు తీసుకొస్తున్నామని. తెలంగాణలో రైతు ఏ కారణం చేత మరణించినా పది రోజుల లోపు 5 లక్షల రూపాయల చెక్కును రైతు ఇంటి వద్ద అందజేస్తున్నామని మంత్రులు అన్నారు.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA