మొలక సూపు మొగులు వైపు

తెలంగాణ, రైతుముచ్చట: అంచనాల ప్రకారామే సకాలంలో రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికి, వానాకాలం సీజన్ ప్రారంభంలో అడపాదడపా విస్తారంగా వర్షాలు కురిసినప్పటికి గత పది, పేదిహేను రోజుల నుండి వాన దేవుడు మొహం చాటేశాడు. అక్కడక్కడ ఆకాశం మేగావృతం అయ్యి చిరుజల్లులు తప్ప పెద్దగా వర్షాలు కురవడం లేదు. వర్షాధారం క్రింద పంటలు పండించిన రైతులు ఎప్పటి లాగానే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు, రాష్ట్రంలో దాదాపు అన్నీ జిల్లాలలో ఇప్పటికే వరి నాట్లు పూర్తి దశకు చేరుకున్నాయి. మొక్కజొన్న, పత్తి చేళ్ళు మొలక స్థాయిలో ఉన్నాయి. పొలాల్లో మొలకెత్తిన విత్తనాలు మొగులుకేసి వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడని చూస్తున్నాయి. ఇలానే మరో వారం, పది రోజులు కొనసాగితే పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాదారం క్రింద పంటలు పండించే రైతులు వర్షాభావాన్ని అంచనా వేసుకొని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నది.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA