ప్రత్యేక ట్రాలీపై కేజ్ వీల్స్ ను పొలాలకు తరలిస్తూ…!

సోన్, రైతుముచ్చట: నిర్మల్ జిల్లా సోన్ లో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు ట్రాక్టర్ యజమానులు, వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే కేజ్ వీల్స్ వలన రోడ్లు పాడైపోకుండా ఉండేందుకు పొలాలకు కీజ్ వీల్స్ ను తరలించడం కోసం ఒక ప్రత్యేక ట్రాక్టర్-ట్రాలీని సమీష్టిగా ఏర్పాటు చేసుకున్నారు. రహాదారులను కాపాడేందుకు సహకరించాలని అధికారుల సూచనతో ట్రాక్టర్ యజమానులు ఈ విధంగా ముందుకు వచ్చారు. సోన్ లో మొత్తం 22 కేజ్ వీల్స్ ఉండగా, వాటిని పొలాలకు తరలించేందుకు లక్ష వ్యయంతో ఒక ట్రాలీని తయారు చేయించారు. దీనికి ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ ను కూడా కేటాయించి, రూ 300 చార్జీని వసూలు చేస్తూ, రైతులపై ఈ భారం పడకుండా, దున్నెందుకు వెళ్తున్నా ట్రాక్టర్ యజమానే చెల్లించేలా చర్యలు తీసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిస్తున్నారు.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA