హార్టికల్చర్ COE ని సందర్శించిన వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి

సిద్దిపేట, రైతుముచ్చట: సిద్దిపేట జిల్లా ములుగులో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ యొక్క “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)” ను రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రఘునందన్ రావు మరియు కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం ఉప కులపతి నిరజా ప్రభాకర్ సందర్శించడం జరిగింది. వివిధ రకాల పండ్లపై అభివృద్ది చేసిన ఈ “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” ను పూర్తిగా తిరిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు. COE లో పండ్ల తోటల పెంపకంపై నెలకొల్పిన అధునాతన సౌకర్యాలను కొనియాడారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి. అదేవిధంగా ఈ సందర్శన సంధర్భంగా COE లో మొక్కలు కూడా నాటడం జరిగింది. ఈ సందర్శన కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ డైరెక్టర్ యెల్. వెంకట్ రామ్ రెడ్డి మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA