ఆప్కాబ్ లో 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ, రైతుముచ్చట: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ (APCOB) లో 26 మేనేజర్ పోస్టులు, 35 స్టాఫ్ ఆసిస్టంట్స్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కనీసం 40% మార్కులతో డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు కాగా, వీటి భర్తీకి సంబందించిన ఆన్ లైన్ రిజిస్థ్రేషన్ ప్రక్రియ ఆప్కాబ్ వెబ్ సైట్ లో జూలై 21 నుండి ఆగష్టు 5, 2021 వరకు జరగునున్నది. సెప్టెంబర్ మొదటి వారంలో వీటికి సంబందించిన ఆన్ లైన్ పరీక్షను నిర్వహించనున్నారు. 26 మేనేజర్ పోస్టులలో 3 పోస్టులను బీఎస్సీ అగ్రికల్చర్, 1 పోస్టును బీఎస్సీ హార్టికల్చర్, 1 పోస్టును బీఎస్సీ వెటరీనరీ, 1 పోస్టును బీఎస్సీ ఫిషరీస్ చేసిన వారికి కేటాయించారు.

నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి
https://www.apcob.org/careers/

ఆన్ లైన్ రిజిష్ట్రేషన్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
https://ibpsonline.ibps.in/apcobvijun21/

Share
EDITOR - RYTHU MUCHATA

EDITOR - RYTHU MUCHATA